ఎడ్జ్ బాస్టన్ (Edgbaston) వేదికగా జరిగిన 2వ టెస్టులో టీమిండియా (Team India) అద్భుతమైన విజయం సాధించింది. మొదటి టెస్టులో ఓడిన తర్వాత, జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) లేకుండా బరిలోకి దిగుతున్న ఈ జట్టు ఎలా ఆడుతుందో అని చాలా మంది అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ, ఎడ్జ్ బాస్టన్‌లో భారత్ తన మొట్టమొదటి విజయాన్ని నమోదు చేసింది.
ఈ విజయం ఒక్కడి వల్లే సాధ్యమైందంటే నమ్మశక్యం కాకపోయినా, అది నిజం! టీమిండియా కెప్టెన్ శుభమన్ గిల్ (Shubman Gill) బ్యాటింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ విజృంభించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు సాధించాడు. గిల్‌తో పాటు మిగతా బ్యాటర్లు అందరూ రాణించడంతో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరును, రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులను చేసింది. అయితే, బ్యాటింగ్‌లో బాగా ఆడినా… బౌలింగ్‌లో అదరగొట్టిన ఆకాష్ దీప్ వల్లే ఈ మ్యాచ్ గెలిచింది అంటే మీరు ఆశ్చర్యపోతారు.
నిజమే, బౌలింగ్‌లో ఆకాష్ దీప్ (Akash Deep) ఈ టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. టీమిండియా ఎంత స్కోరు చేసినా, ఇంగ్లాండ్ బ్యాటర్లు దాన్ని ఛేదించేందుకు ప్రయత్నిస్తుంటారు, కానీ వారికి అడ్డుకట్ట వేసింది మాత్రం ఆకాష్ దీప్. మొదటి ఇన్నింగ్స్‌లో, మ్యాచ్ మళ్ళీ చేజారిపోతుందేమో అనే సమయంలో 4 కీలక వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ 6 వికెట్లు పడగొట్టి టీమిండియాను గెలిపించాడు. ఇలా కీలక సమయాల్లో ఇంగ్లాండ్ బ్యాటర్లను అవుట్ చేసి, టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.