చీటింగ్ కేసు (Cheating Case)లో అరెస్టయిన అఘోరీ (Aghori) కి సంగారెడ్డి జైలు (Sangareddy Jail) అధికారుల షాక్ ఇచ్చారు. పూజల పేరుతో తన వద్ద రూ.10 లక్షలు అఘోరీ వసూలు చేశారని బాధిత మహిళ పోలీసులకు (Police) ఫిర్యాదు (Complaint) చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అఘోరీని అరెస్టు చేసి, హైదరాబాద్ (Hyderabad)కు తీసుకువచ్చారు. చీటింగ్ కేసులో ఆధారాలు సేకరించిన పోలీసులు అఘోరీని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. కోర్టు (Court) రిమాండ్ (Remand) విధించింది.
కోర్టు ఆదేశాల మేరకు అఘోరీని సంగారెడ్డి జైలుకు తరలించగా, జైలు అధికారులు షాక్ ఇచ్చారు. ఆడ, మగ (Male or Female) తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని అధికారులు తేల్చి చెప్పారు. సంగారెడ్డి సెంట్రల్ జైలు అధికారులు అఘోరీని తిరిగి పంపించేశారు. లింగ నిర్ధారణ జరిగితే గానీ జైలులోని బ్యారక్ కేటాయించలేమని అధికారులు చెప్పారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు డాక్టర్ల వైద్య పరీక్షల అనంతరం లింగ నిర్ధారణ జరిగే అవకాశం ఉంది. పరీక్షల తర్వాత చంచల్ గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించనున్నట్లు సమాచారం.