విజయ్, త్రిష మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

విజయ్, త్రిష మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

తమిళ చిత్ర పరిశ్రమలో ‘మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఆన్-స్క్రీన్ కపుల్’ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే పేరు విజయ్ – త్రిష (Vijay-Trisha). ‘గిల్లి’, ‘కురువి’, ‘తిరుపాచి’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల తర్వాత ఇటీవలే ‘లియో’లో కలిసి నటించిన ఈ జోడీ.. వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ ఒకటవుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరి వయసు ఎంత? వీరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ (Age Gap) ఎంత? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు.

విజయ్ వయసు ఎంత?
తమిళనాడులో (Tamil Nadu) ప్రస్తుతం రాజకీయంగా, సినిమా పరంగా హాట్ టాపిక్‌గా మారిన విజయ్.. 1974 జూన్ 22న జన్మించారు. ప్రస్తుతం ఆయన వయసు 51 ఏళ్లు. దశాబ్దాలుగా వెండితెరపై తన మేజిక్ చూపిస్తున్న విజయ్, 50ల్లో కూడా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా కనిపిస్తుండటం విశేషం.

త్రిష వయసు
ఇక సౌత్ ఇండియా ఎవర్ గ్రీన్ క్వీన్ త్రిష కృష్ణన్ (Trisha Krishnan) 1983 మే 4న జన్మించారు. ప్రస్తుతం ఆమె వయసు 43 ఏళ్లు. నాలుగు పదుల వయసులోనూ తన గ్లామర్‌తో కుర్రకారును ఆకట్టుకుంటూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. గూగుల్ సెర్చ్ లెక్కల ప్రకారం.. విజయ్ (51), త్రిష (43)ల మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 9 ఏళ్లు. దశాబ్ద కాలానికి పైగా వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండటం, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండటంతో.. వీరి పెళ్లి వార్తలపై అభిమానుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు పెళ్లి వార్తల్లో నిజమెంత?
గతంలోనూ వీరిద్దరి గురించి ఇలాంటి పుకార్లు చాలానే వచ్చాయి. తాజాగా వీరిద్ద‌రూ ఒక్క‌టి కాబోతున్నార‌నే వార్త‌లు త‌మిళ‌నాట కోడైకూస్తున్నాయి. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ పార్టీ TVK విజ‌య తీరానికి చేర్చి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్నిక‌లకు ముందు త‌న భార్య సంగీత‌కు ఆమె కోరుకున్న‌ట్టుగానే విజ‌య్ విడాకులు ఇచ్చారు. దీంతో త్రిష‌-విజ‌య్ మ‌ధ్య ఉన్న ల‌వ్ రిలేష‌న్‌కు లైన్ క్లియ‌ర్ అయ్యింద‌ని, త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకుంటార‌ని టాక్‌. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో విజ‌య్ విజ‌యం సాధించిన అనంత‌రం త్రిష విజ‌య్ నివాసానికి వెళ్లి అభినంద‌న‌లు తెలిపిన విష‌యం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment