బిలీనియ‌ర్ భార్య‌.. ఛీ ఛీ.. ఇదేం పాడుపని

బిలీనియ‌ర్ భార్య‌.. ఛీ ఛీ.. ఇదేం పాడుపని

ఒక వ్యక్తి ఎంతో కష్టపడి ఓ చిన్న కంపెనీని వందల కోట్ల విలువైన సంస్థగా మార్చాడు. కానీ తన కుటుంబాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలమయ్యాడు. అతని భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయంలో ప‌క్కా ఆధారాలు సేకరించిన భర్త, ఆమెతో నిలదీయగా… ఆమె తిరిగి అతనిపై గృహహింస కేసు పెట్టింది. దీంతో అరెస్టు నుంచి త‌ప్పించుకొని తిరుగుతూ తాను ప‌డుతున్న ఇబ్బందుల‌ను, ఎదుర్కొంటున్న కష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచంతో పంచుకున్నాడు ఆ భ‌ర్త‌.

చెన్నైకి చెందిన‌ ప్రసన్న రిప్లింగ్ సంస్థ‌ ($10 బిలియన్ల విలువ) స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. తన కాలేజీ డేస్‌లో దివ్యను ప్రేమించి ప‌దేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాన‌ని, తమకు 9 సంవ‌త్స‌రాల బాబు ఉన్నాడ‌ని, ప్రస్తుతం తన ఆస్తుల విలువ 10 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపుగా 86 కోట్ల రూపాయలు) అని ప్ర‌స‌న్న‌ చెప్పుకొచ్చాడు.

త‌న భార్య అనూప్ అనే వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంద‌ని, దానికి సంబంధించిన ఆధారాల‌తో నిల‌దీస్తే త‌న‌ను భార్య దివ్య తీవ్రంగా వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. విడాకులు ఇవ్వడానికి కోట్లు డిమాండ్ చేస్తోందని, అంతేకాకుండా తన పాస్‌పోర్టును లాకర్‌లో పెట్టి ఇవ్వడం లేదని తెలిపారు. కోర్టుకు హాజరుకావడాన్ని కూడా అడ్డుకుంటోందని ఆరోపించారు. తనపై గృహహింస కేసు పెట్టడమే కాకుండా, సింగపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసి తనపై అత్యాచారం కేసు మోపిందని ప్రసన్న వెల్లడించాడు. అయితే, ఆ కేసు నిరాధారమని సింగపూర్ పోలీసులు తేల్చిచెప్పారని పేర్కొన్నాడు.

దివ్య వివాహేత‌ర సంబంధం ఆధారాల‌ను భ‌ర్త బ‌య‌ట‌పెట్టారు. దీంతో ప్రసన్న కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనేక మంది ఆయనకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. అతనికి న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. దివ్య చేసిన ప‌నిని నెటిజ‌న్లంతా చీద‌రించుకుంటున్నారు. అయితే, ప్ర‌స‌న్న భార్య దివ్య ఇంకా ఈ విషయంపై స్పందించలేదు. ఆమె వాదన ఏంటో తెలియకపోవడంతో, ప్రసన్నకు మరింత మద్దతు లభిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment