కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం

కల్తీ కల్లు తాగి 30 మందికి అస్వస్థత, ఆరుగురి పరిస్థితి విషమం

కల్తీ కల్లు (Adulterated Liquor) ప్రాణాల మీద‌కు తెచ్చింది. క‌ల్తీ క‌ల్లు తాగి 30 మంది అస్వ‌స్థ‌త‌ (Illness)కు గుర‌య్యారు. వీరిలో ఆరుగురి ప‌రిస్థితి (Condition) విష‌మంగా (Critical) ఉంది. కామారెడ్డి (Kamareddy) జిల్లాలో గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుస్తీ పోటీల సందర్భంగా కొందరు గ్రామస్తులు కల్లు తాగారు. అయితే వారు తాగిన కల్లు కల్తీగా ఉండటంతో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఆరుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో, కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి (Kamareddy Government Hospital) లోని ఐసీయూ(ICU)లో వీరికి చికిత్స అందిస్తున్నారు.

అస్వస్థతకు గురైన బాధితులు వింతగా ప్రవర్తించడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. కల్లు దుకాణం (Liquor shop)పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.

దుర్కిలోనూ.. ఇద్దరి పరిస్థితి విషమం
ఇదే తరహాలో మంగళవారం నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామంలోని కల్లు దుకాణంలో కల్తీ కల్లు తాగిన 22 మంది వింత ప్రవర్తనతో ఇబ్బందులు పడ్డారు. పిచ్చిపిచ్చిగా (Erratically) ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు వారిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి (Banswada Area Hospital) తరలించారు. బాధితులలో అంకోల్, సంగెం, హాజీపూర్, దుర్కి గ్రామాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో, వెంటనే నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఘటనపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తరచుగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. కల్లు దుకాణాలపై మరింత నిఘా పెట్టాలని, కల్తీ కల్లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment