ఆ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులోని మాట చెప్పిన స్నేహ‌

ఆ హీరో అంటే నాకు పిచ్చి.. మనసులోని మాట చెప్పిన స్నేహ‌

నటి (Actress) స్నేహ (Sneha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సావిత్రి (Savitri), సౌందర్య (Soundarya) తర్వాత ఆ స్థాయిలో హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుందీ అందాల తార. గతంలో ఎన్నో హిట్ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన స్నేహ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ బిజీగా గడుపుతోంది. ఇప్పటికే తెలుగులో పలు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

తెలుగు, తమిళంలో అద్భుత ప్రస్థానం
స్నేహ.. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. స్నేహను ఇష్టపడని వారు ఎవరూ ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. స్నేహ అసలు పేరు సుహాసిని. తెలుగులో ఈ భామ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది, వాటిలో ‘సంక్రాంతి’ (Sankranti), ‘రాధాగోపాళం’ (Radha Gopalam), ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) వంటి క్లాసిక్ హిట్స్ కూడా ఉన్నాయి.

స్నేహ తెలుగులో ‘తొలివలపు’ (Tholivalapu) అనే సినిమాతో పరిచయం అయ్యింది. ఈ సినిమాలో గోపిచంద్ హీరోగా నటించాడు. ఆ తర్వాత ‘ప్రియమైన నీకు’ (Priyamaina Neeku) సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. అనంతరం వరుసగా సినిమాలు చేసింది. తెలుగుతో పాటు తమిళంలోనూ నటించి మెప్పించింది. చూడచక్కని రూపంతో పాటు అద్భుతమైన నటనతోనూ ఆకట్టుకుంది స్నేహ.

తెలుగులో వరుసగా ‘హనుమాన్ జంక్షన్’, ‘శ్రీరామదాసు’, ‘మహారధి’, ‘మధుమాసం’, ‘సంక్రాంతి’, ‘వెంకీ’, ‘ఏవండోయ్ శ్రీవారు’, ‘పాండురంగడు’ లాంటి సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. ఆ తర్వాత స్నేహ ఈ మధ్యకాలంలో సహాయక పాత్రల్లో నటిస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘S/o సత్యమూర్తి’, రామ్ చరణ్ హీరోగా చేసిన ‘వినయ విధేయ రామ’ సినిమాల్లో సహాయక పాత్రల్లో మెరిసింది స్నేహ. కాగా, రీసెంట్‌గా దళపతి విజయ్ హీరోగా నటించిన ‘గోట్’ సినిమాలో ఆయన భార్యగా చేసి ఆకట్టుకుంది.

స్నేహ మనసులో మాట
స్నేహ తమిళం (Tamil)లోనూ చాలా మంది స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. విజయ్, అజిత్, కమల్ హాసన్, సూర్య, ప్రశాంత్, ధనుష్ వంటి వారితో నటించింది. ముఖ్యంగా దళపతి విజయ్, అజిత్ లతో ఆమె సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫేవరెట్ హీరో (Favorite Hero) ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పారు. స్నేహ మాట్లాడుతూ.. తనకు అజిత్ (Ajith) అంటే ఇష్టమని అన్నారు.

ప్రస్తుతం స్నేహ ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే స్నేహ, రెగ్యులర్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment