అభిమానుల‌కు ప్ర‌భాస్ మ‌ర‌ద‌లు గుడ్‌న్యూస్

sanjjanaa-galrani-pregnancy-announcement

ప్ర‌ముఖ నటి సంజనా గల్రానీ (Sanjjanaa Galrani) మరోసారి తల్లి (Mother) కాబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు. చీరకట్టులో బేబీ బంప్‌ (Baby bump) తో ఉన్న తన ఫొటోలు పోస్ట్ చేసి, ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్నారు. ఇప్పటికే ఆమెకు ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో తన కుమారుడితో కలిసి పూజల్లో పాల్గొంటున్న దృశ్యాలు కనిపించాయి.

‘బుజ్జిగాడు (Bujjigadu)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంజ‌న‌.. ప్ర‌భాస్ (Prabhas) స‌ర‌స‌న హీరోయిన్ త్రిష చెల్లిగా న‌టించి మెప్పించారు. ఆ త‌రువాత ‘సోగ్గాడు (Soggadu)’, ‘పోలీస్ పోలీస్ (Police Police)’, ‘ముగ్గురు (Mugguru)’ తదితర చిత్రాల్లో నటించారు. 2021లో అజీజ్ పాషా‌ (Aziz Pasha)ను వివాహం చేసుకున్నారు. కాగా, రెండోసారి త‌ల్లికాబోతున్న సంజ‌నకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment