పహల్గాం (Pahalgam) ఉగ్రదాడిపై ప్రముఖ నటి హీనా ఖాన్ స్పందించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నెల 22న కశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు (Terrorists) దాడి జరిపారు. ఈ దాడిలో 26 మంది మరణించారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై నటి హీనాఖాన్ (Actress Hina Khan) స్పందించారు. తన స్వస్థలమైన కశ్మీర్ (Kashmir) లో జరిగిన ఈ ఘటన తనను తీవ్రంగా బాధించిందని చెప్పింది.
“ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నా హృదయపూర్వక సంతాపం. ఓ ముస్లింగా ఈ దాడి చూసి సిగ్గు వేసింది. భారతదేశంలో ఉన్న హిందూ సోదర సోదరీమణులందరికీ, అలాగే నా తోటి భారతీయులందరికీ నేను హృదయపూర్వకంగా క్షమాపణలు (Heartfelt Apologies) చెబుతున్నాను” అంటూ ఆమె పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు హీనా ఖాన్‌పై విభిన్న అభిప్రాయాలను తెచ్చిపెట్టాయి. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తే, మరికొందరు క్షమాపణలు ఎందుకంటూ ప్రశ్నలు వేస్తున్నారు.