నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్..

నటుడు విశాల్‌కు మద్రాస్ హైకోర్టులో బిగ్ షాక్..

నటుడు మరియు నిర్మాత విశాల్ కు మద్రాస్ హైకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో సంబంధించిన రుణ వివాదంలో కోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది. గతంలో కోర్టు విధించిన రూ.10 కోట్ల డిపాజిట్‌కు గడువు పొడిగించాలని విశాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం (ఫిబ్రవరి 17, 2026) ధర్మాసనం కొట్టివేసింది. 2016లో ‘మరుదు’ సినిమాకు గోపురం ఫిల్మ్స్ నుండి రుణంగా తీసుకున్న రూ.21.29 కోట్లను లైకా ప్రొడక్షన్స్ స్వీకరించింది. ఒప్పంద ప్రకారం, విశాల్ ఈ మొత్తాన్ని 30 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాల్సి ఉంది. కానీ ఒప్పందాన్ని ఉల్లంఘించాడని, సినిమాల హక్కులను అనుమతి లేకుండా ఇతరులకు విక్రయిస్తున్నారని లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది.

సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు ప్రకారం విశాల్ మొత్తం బాకీతో వడ్డీ చెల్లించాల్సి ఉంది. అనంతరం ఆయన అప్పీల్‌కు వెళ్లగా, మధ్యంతర స్టే కోసం రూ.10 కోట్లు డిపాజిట్ చేయాలని కోర్టు షరతు విధించింది. అయితే, విశాల్ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని, డబ్బు సమీకరించడానికి కొన్ని వారాల గడువు కావాలని కోరిన అభ్యర్థనను జస్టిస్ సి.వి. కార్తికేయన్, జస్టిస్ కె. కుమరేష్ బాబు లతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది. ఇప్పటికే తగిన సమయం ఇచ్చామని, ఇక గడువు పొడిగించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో విశాల్‌పై ఆర్థిక మరియు న్యాయపరంగా మరింత ఒత్తిడి పెరిగింది. కోర్టు ఆదేశాలను పాటించని పక్షంలో లైకా ప్రొడక్షన్స్ తమ బకాయిల వసూలు కోసం తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment