కోలీవుడ్ ఇళయ దళపతి, టీవీకే(TVK) (తమిళాగ వెట్టి కజగం) పార్టీ అధ్యక్షుడు విజయ్(Vijay)పై కేసు(Case) నమోదైంది. టీవీకే పార్టీ రెండవ మానాడు సభ మదురై (Madurai)లో జరిగింది. ఈ సభలో విజయ్ ర్యాంప్ (Ramp)పై నడిచి వెళ్తున్న సమయంలో అతన్ని కలవాలని ప్రయత్నించిన అభిమాని(Fan) శరత్ కుమార్ (Sharath Kumar)ను బౌన్సర్లు (Bouncers) అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనలో గాయాలు అయ్యిన శరత్ కుమార్ పెరంబలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, విజయ్, బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్, అతని బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఆరా తీయడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజయ్ ఇటీవల తన రాజకీయ ప్రయాణాన్ని ముమ్మరం చేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనపై విమర్శలు కురిపించే అవకాశం ఉంది. టీవీకే పార్టీ నాయకత్వం ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.