బాలీవుడ్ నటుడు, ‘హౌజ్ అరెస్ట్’ (House Arrest) షో హోస్ట్ అజాజ్ ఖాన్ (Ajaz Khan) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల అశ్లీల కంటెంట్ (Obscene Content) స్ట్రీమ్ చేసిన ఆరోపణలపై ఇతనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, తాజాగా ఆయనపై 30ఏళ్ల ముంబైకు (Mumbai) చెందిన యువతి (Young Woman) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదులో నటుడు అజాజ్‌పై సంచలన ఆరోపణలు చేసింది బాధిత యువతి.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నటుడు అజాజ్ ఖాన్ “సినిమాల్లో అవకాశం కల్పిస్తానని చెప్పి నన్ను నమ్మించి పలుమార్లు లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడ్డాడు” అని తెలిపింది. ఈ మేరకు ముంబై పోలీసులు అతనిపై ఐపీసీ 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అజాజ్ ఖాన్ ఇప్పటికే వివిధ వివాదాలతో వార్తల్లో నిలిచిన నేపథ్యం ఉంది. తాజా ఆరోపణలతో అతని పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది.