రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ కీలక విషయాలను వెల్లడించింది. నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ ప్రభుత్వం కి సమగ్ర నివేదికను సమర్పించినట్లు సమాచారం.
ఈ కేసు వివరాలు:
నిధుల మళ్లింపు: హెచ్‌ఎండీఏ (HMDA) నిధులు రూ. 55 కోట్లను ఫార్ములా ఈ రేసు కోసం దుర్వినియోగం చేశారని ఏసీబీ నివేదికలో పేర్కొంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత, ఎలాంటి అనుమతులు లేకుండా, నిధులను బదిలీ చేయడం వెనుక ‘క్విడ్ ప్రో కో’ జరిగి ఉండవచ్చని ఏసీబీ అనుమానం వ్యక్తం చేసింది.
విదేశీ కరెన్సీలో నిధుల బదిలీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లేదా ఆర్థికశాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదని నివేదికలో స్పష్టంగా ఉంది.
ఏసీబీ నివేదికలో ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ల పేర్లను నిందితులుగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. వారిపై ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ఏసీబీ ప్రభుత్వాన్ని కోరింది.
విచారణ: ఈ కేసుపై దానకిషోర్ ఫిర్యాదు తర్వాత, ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్, అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్‌ఎన్‌రెడ్డిలను ప్రశ్నించారు. అలాగే, ఎస్ నెక్స్ట్ జెన్, ఫార్ములా ఈ రేసు ప్రతినిధులను కూడా విచారించారు.
ఓట్లు కొనేందుకు కాంగ్రెస్ ‘హైడ్రా’: కేటీఆర్