ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని లిక్కర్ స్కాం (Liquor Scam)లో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో సీజ్ (Seize) చేసిన రూ.11 కోట్ల నగదు వ్యవహారంపై ఏసీబీ కోర్టు (ACB Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ డబ్బు ఎవరిది? ఎలా వచ్చిందన్న అనుమానాల నేపథ్యంలో, నగదును వేరు చేసి ఉంచాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. అలాగే, ఈ నగదుపై పంచనామా నివేదికను (Panchnama Report) సిట్(SIT) తప్పనిసరిగా సమర్పించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
కోర్టు ఆదేశాల మేరకు సిట్ ఇప్పటికే మాచవరం (Machavaram) SBI బ్రాంచ్‌లో రూ.11 కోట్లు డిపాజిట్ చేసింది. అయితే డిపాజిట్ సమయంలో వీడియో తీయకపోవడంతో రాజ్ కేసిరెడ్డి (Raj Kesireddy) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ డబ్బును స్పష్టంగా వేరుగా ఉంచాలని, తనకూ సంబంధం లేదన్న రాజ్ కసిరెడ్డి వాదనలతో కోర్టు ఆదేశాలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నగదుపై ఉన్న నోట్లు, నెంబర్ వివరాలు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు.
రాజ్ కేసిరెడ్డి లాయర్లు ఈ రోజు మాచవరం SBI బ్రాంచ్‌కు వెళ్లి నగదు నిల్వ వివరాలను పరిశీలించనున్నారు. కసిరెడ్డి వాదన ప్రకారం, ఈ నగదును వరుణ్(Varun)కి ఇచ్చినట్టు చెబుతున్నా, ఆ నోట్లను RBI ఎప్పుడు ముద్రించిందన్నది కీలక ఆధారంగా మారవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు విచారణ మరింత వేగం తీసుకునే అవకాశాలున్నాయి.







