సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన ఆటతీరు ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారు. సరిగ్గా ఇదేరోజు (2015 జనవరి 18న) వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో డివిలియర్స్ తన జీవితకాలపు గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 144 పరుగులు చేసిన అతను, క్రికెట్ ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ ఇన్నింగ్స్‌లో 16 సిక్సులు, 9 ఫోర్లు ఉండడం విశేషం.
ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు
ఇది మాత్రమే కాదు, అదే మ్యాచ్‌లో డివిలియర్స్ కేవలం 31 బంతుల్లో సెంచరీ సాధించి వన్డే క్రికెట్‌లో వేగవంతమైన సెంచరీ రికార్డు నమోదు చేశాడు. ఈ ఇన్నింగ్స్ డివిలియర్స్ క్రికెట్ కెరీర్‌లోనే కాకుండా వన్డే చరిత్రలో గొప్ప ఘట్టంగా నిలిచింది.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్