ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసు.. పోలీసులపై కాల్పులు

ఆప్ ఎమ్మెల్యే అత్యాచారం కేసు.. పోలీసులపై కాల్పులు

పంజాబ్‌ (Punjab)లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) (AAP) ఎమ్మెల్యే (MLA)హర్మీత్ పఠాన్‌మజ్రా (Harmeet Pathanmajra) ఒక అత్యాచారం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

ఎమ్మెల్యేపై ఆరోపణలు, అరెస్ట్
పంజాబ్‌లోని సనౌర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన హర్మీత్ పఠాన్‌మజ్రాపై అత్యాచారం, మోసం, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలు ఉన్నాయి. ఒక మహిళ(Women) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎమ్మెల్యే విడాకులు తీసుకున్నట్లు అబద్ధం చెప్పి తనతో వైవాహిక సంబంధం పెట్టుకున్నారని ఆమె ఆరోపించింది. లైంగిక దోపిడీ, బెదిరింపులు, అశ్లీల చిత్రాలు పంపినట్లు కూడా ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు మంగళవారం ఉదయం కర్నాల్‌లో ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు.

పోలీసులపై కాల్పులు.. పారిపోయిన ఎమ్మెల్యే
అరెస్ట్ తర్వాత ఎమ్మెల్యేను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తుండగా, హర్మీత్ పఠాన్‌మజ్రా మరియు అతని సహాయకులు పోలీసులపై కాల్పులు జరిపారు. అనంతరం వారు ప్రయాణిస్తున్న రెండు ఎస్‌యూవీ వాహనాల్లోంచి పారిపోయారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఒక కానిస్టేబుల్‌ను ఢీకొట్టి, వేరే వాహనంలో ఎమ్మెల్యే అక్కడి నుంచి తప్పించుకున్నారు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సొంత ప్రభుత్వంపైనే విమర్శలు
ఈ ఘటనకు ముందు, పఠాన్‌మజ్రా తన సొంత పార్టీ ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేశారు. పంజాబ్‌లో వరదలను ఎదుర్కోవడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎఫ్‌ఐఆర్ నమోదైన తర్వాత ఆయన ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై విరుచుకుపడ్డారు. ఢిల్లీలోని ఆప్ నాయకత్వం పంజాబ్‌ను చట్టవిరుద్ధంగా పాలిస్తోందని, తన గొంతును అణచివేయలేరని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇతర ఎమ్మెల్యేలు తనకు మద్దతు ఇవ్వాలని కూడా కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment