అమీర్‌ఖాన్‌ కోసం దిగొచ్చిన OTT సంస్థ‌..

అమీర్‌ఖాన్‌ కోసం దిగొచ్చిన OTT సంస్ధ..

బాలీవుడ్‌ (Bollywood) లో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌గా పేరుగాంచిన అమీర్‌ఖాన్‌ (Aamir Khan), తన తాజా చిత్రం ‘సితారే జమీన్‌ పర్‌’ (‘Sitare Zameen Par’) ఓటీటీ హక్కులను (OTT Rights) ఏ సంస్థకూ ఇవ్వకుండా, యూట్యూబ్‌ (YouTube) లో పే-పర్‌-వ్యూ మోడల్‌ (Pay-Per-View Model)లో విడుదల చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని అమీర్‌ఖాన్‌ భావిస్తున్నారు. ఈ నిర్ణయంతో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) ఆందోళనలో పడింది.

తాజా సమాచారం ప్రకారం, అమీర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తూ నెట్‌ఫ్లిక్స్‌ తమ ఆఫర్‌ను సవరించింది. మొదట ‘సితారే జమీన్‌ పర్‌’ డిజిటల్‌ హక్కుల కోసం రూ.60 కోట్లు ఆఫర్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌, ఇప్పుడు ఆ మొత్తాన్ని రెట్టింపు చేసి రూ.125 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది. ఈ విషయంపై అమీర్‌ఖాన్‌తో నెట్‌ఫ్లిక్స్‌ బిజినెస్‌ టీమ్‌ చర్చలు జరుపుతోంది. అయితే, అమీర్‌ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

నెట్‌ఫ్లిక్స్‌ ఆందోళనకు కారణం లేకపోలేదు. ఒకవేళ ‘సితారే జమీన్‌ పర్‌’ యూట్యూబ్‌లో పే-పర్‌-వ్యూ మోడల్‌లో విజయవంతమైతే, ఇతర నిర్మాతలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. దీంతో ప్రేక్షకులు టికెట్‌ డబ్బులు ఖర్చు చేయకుండా, యూట్యూబ్‌లో కొత్త సినిమాలను ఇంట్లోనే కుటుంబంతో కలిసి చూసే అవకాశం ఉంటుంది. ఇది ఓటీటీ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ రెట్టింపు ఆఫర్‌ ఇచ్చేందుకు వెనుకాడటం లేదు. చివరికి అమీర్‌ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment