మీ ఆధార్ కార్డ్‌ను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి మీకు ఇంకా ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. డిసెంబర్ 14వ తేదీతో UIDAI (ఆధార్ అధికారి సంస్థ) ద్వారా నిర్ణయించబడిన ఉచిత అప్‌డేట్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఆధార్ కార్డు అప్‌డేట్ చేయాలంటే రూ. 50 చెల్లించాల్సి ఉంటుంది.
మీ ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, బయోమెట్రిక్స్, చిరునామా లేదా ఇతర వివరాలను అప్‌డేట్ చేసుకోవడం ఎలాగంటే..
- UIDAI అధికారిక వెబ్‌సైట్ (myaadhaar.uidai.gov.in)ని సందర్శించండి.
- మీ ఆధార్ నంబర్ మరియు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ద్వారా OTP పొందండి.
- “ఆధార్ అప్‌డేట్” ఆప్షన్‌ను ఎంచుకోండి.
- అవసరమైన అప్‌డేట్ వివరాలను ఎంటర్ చేయండి.
- పత్రాలను అప్‌లోడ్ చేయండి.
- “నాకు పైన వివరాలు సరైనవి” అనే చెక్‌బాక్స్ ను టిక్ చేయాలి.
- చివరగా 14 అంకెల రసీదు నంబర్ పొందండి.
ఈ రసీదు నంబర్‌తో మీరు అప్‌డేట్ స్థితిని ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు.








