త‌ప్ప‌తాగి తిరుమ‌ల కొండ‌పై యువ‌కుడి వీరంగం

త‌ప్ప‌తాగి తిరుమ‌ల కొండ‌పై యువ‌కుడి వీరంగం

ప‌విత్ర పుణ్య‌క్షేత్రం తిరుమ‌లలో మ‌రో అప‌చారం వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ యువ‌కుడు రచ్చ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆలయ మాడ‌వీధులో మద్యం మ‌త్తులో ఓ యువ‌కుడు రెచ్చిపోయాడు. ‘నేను లోకల్.. మందు తాగుతా, అవసరమైతే మద్యం కూడా అమ్ముతా’ అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. పీకలదాకా మద్యం తాగిన ఆ యువ‌కుడు తిరుమల కొండ‌పై స్వామివారి మాడ వీధుల్లో వీరంగం సృష్టించాడు. ఇదే క్ర‌మంలో ఓ మహిళతో వాగ్వాదానికి దిగాడు. విజిలెన్స్‌ అధికారుల ముందే ఇదంతా జరగడం గమనార్హం. అనంతరం, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు. తిరుమ‌ల కొండ‌పైకి మందు ఎలా వ‌చ్చింది..? మ‌ద్యం సేవించిన వ్య‌క్తిని కొండ‌పైకి ఎలా అనుమ‌తించారు..? అనే ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment