ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం ఫ్యాషన్ – తమన్నా

ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపం ఫ్యాషన్ – తమన్నా

అందం, అభినయంతో ఆకట్టుకునే తమన్నా ఫ్యాషన్‌ను ఓ శక్తివంతమైన ఆయుధంగా చూస్తోంది. తన వ్యక్తిత్వాన్ని, భావాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఫ్యాషన్ రంగమే ముఖ్యమైన మార్గమని ఆమె అంటోంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన త‌మ‌న్నా.. “నా ఆలోచనలు, నేను ఎలా ఉండాలనుకుంటున్నాననే విషయాలను ప్రదర్శించడానికి ఫ్యాషన్ నాకు బలంగా మారింది. ఇది కేవలం దుస్తుల గురించి మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని ఎలివేట్ చేసే మాధ్యమం” అని చెప్పింది. ఫ్యాషన్ ప్రపంచంలో తమన్నా అనేక ప్రయోగాలు చేస్తూ, తనదైన స్టైల్‌ను ఏర్పరచుకుంటోంది. “ఫ్యాషన్ మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మనల్ని మనం ప్రత్యేకంగా భావించేలా చేస్తుంది” అని ఈ అందాల తార అభిప్రాయపడింది.

Join WhatsApp

Join Now

Leave a Comment