సినీ ప్రపంచంలో బాలీవుడ్ మూవీ ‘ఛావాస(Chhaava) సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం, చరిత్ర సృష్టించిన ‘బాహుబలి 2’ రికార్డును అధిగమించి, బాలీవుడ్‌లో కొత్త మైలురాయిని చేరుకుంది.
25 రోజుల్లోనే..
‘బాహుబలి 2’ హిందీ వెర్షన్ రూ. 510 కోట్లు వసూలు చేయగా, ఫిబ్రవరి 14న విడుదలైన ‘ఛావా’ ఇప్పటివరకు రూ. 516 కోట్లు రాబట్టింది. ఈ విజయంతో బాలీవుడ్లో హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన ఆరో సినిమాగా ‘ఛావా’ నిలిచింది. ‘బాహుబలి 2’ రికార్డును 25 రోజుల్లోనే అధిగమించడం గమనార్హం. ‘ఛావా’ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించి బాలీవుడ్‌లో హిట్ టాక్ సంపాదించుకున్న భారీ చారిత్రక చిత్రం ‘ఛావా’. ప్రముఖ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.