నటి తమన్నా భాటియా(Tamannaah Bhatia) మరియు నటుడు విజయ్ వర్మ(Vijay Varma) బ్రేకప్ అయ్యారని ఇటీవల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, తమన్నా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ప్రేమ, సంబంధాల (Relationship) గురించి చేసిన వ్యాఖ్యలు(Love Advice) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సంబంధాలు బిజినెస్ ట్రాన్సాక్షన్లా?
తమన్నా తన ఇంటర్వ్యూలో “ప్రేమించేవాడిని కాస్త తెలివిగా సెలెక్ట్ చేసుకోండి” అని చెప్పింది. అదేవిధంగా, రిలేషన్షిప్ అంటే కూడా ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లా మారిపోయిందని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర చర్చకు దారి తీశాయి.
ఆమె వ్యాఖ్యల వెనుక ఏమైనా వ్యక్తిగత అనుభవాలున్నాయా? నిజంగానే విజయ్ వర్మతో ఆమె బ్రేకప్ అయ్యిందా? అనే ప్రశ్నలు అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారాయి. వీరిద్దరి బ్రేకప్‌పై మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెల్లడికాలేదు.