ఆసిస్‌ బ్యాటింగ్.. ష‌మీకి తొలి వికెట్

ఆసిస్‌ బ్యాటింగ్.. ష‌మీకి తొలి వికెట్

ఐసీసీ ఛాంపియ‌న్ ట్రోఫీ 2025 కీల‌క పోరు ప్రారంభ‌మైంది. దుబాయ్ వేదిక‌గా భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య సెమీ ఫైన‌ల్ పోరు ప్రారంభ‌మైంది. టాస్ గెలిచిన ఆసిస్ బ్యాంటింగ్‌ను ఎంచుకుంది. భార‌త బౌల‌ర్ల దాటికి ఆసిస్ ఆటగాళ్లు త‌డ‌బ‌డుతున్నారు. టీమిండియా బౌల‌ర్లు ష‌మీ, హార్దిక్ పాండ్యా విసురుతున్న బంతుల‌కు ఆసిస్ ఓపెన‌ర్లు భ‌య‌ప‌డుతున్నారు. మూడో ఓవ‌ర్ లాస్ట్ బంతికి ఓపెన‌ర్ కూపర్ కొన్నోలీ పెవిలియ‌న్ బాట‌ప‌ట్టారు. వ‌న్‌డౌన్ బ్యాట్సెమెన్‌గా స్మిత్ క్రీజ్‌లోకి వ‌చ్చాడు. ప్ర‌స్తుతం 4 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోర్ 17 ప‌రుగులు చేసి ఒక వికెట్ కోల్పోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment