కోయంబత్తూర్ పోలీసులు మరోసారి భారీ డ్రగ్స్ ముఠా గుట్టును బహిర్గతం చేశారు. పక్కా సమాచారం ఆధారంగా కేరళ-తమిళనాడు సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా పెట్టి, డ్రగ్స్ విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పోలీసులు రూ. 10 లక్షల విలువైన నిషేధిత మాదకద్రవ్యమైన LSD, 2 కార్లు, 2 బైక్లు, 10 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అదుపులో ఉన్న నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ ఘటనతో కోయంబత్తూర్ పట్టణం, ముఖ్యంగా యువతలో డ్రగ్స్ వ్యాప్తిపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తక్షణ చర్య వల్ల పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా అడ్డుకట్టపడిందని అధికారులు వెల్లడించారు.