“ఢీ” డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు

"ఢీ" డ్యాన్సర్ ఆత్మహత్య.. అభిపై సంచలన ఆరోపణలు

బుల్లితెర‌పై పాపుల‌ర్ అయిన డ్యాన్సింగ్ షో “ఢీ” డ్యాన్స‌ర్ కావ్య కల్యాణి (24) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఖమ్మం రూరల్ మండలం పొన్నెకల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఆమె మరణానికి “ఢీ” షో డ్యాన్సర్ అభి కారణమని సెల్ఫీ వీడియోలో వెల్లడించడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.

నాకు న్యాయం కావాలి..
ఆత్మహత్యకు ముందు కావ్య కల్యాణి ఓ వీడియో రికార్డ్ చేస్తూ తన బాధను వ్యక్తం చేసింది. “నాకు న్యాయం జరగాలి. 5 ఏళ్లుగా ప్రేమించానని చెప్పి అభి న‌న్ను పెళ్లి చేసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, ఇప్పుడు వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు” అంటూ కన్నీటి పర్యంతం అయింది. ఈ వీడియో బుల్లితెర ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్రస్తుతం ఖమ్మం పోలీసులు నిందితుడు అభిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీస్ ద‌ర్యాప్తులో మ‌రిన్ని విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment