ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

ఉపాధ్యాయుడి దాష్టీకం.. విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి

Summarize with AI

హైదరాబాద్ మియాపూర్‌లోని మదీనగూడ ప్రభుత్వ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిపై విచక్షణరహితంగా దాడి చేసిన ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. దాడిలో విద్యార్థి ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఉపాధ్యాయుడు గతంలో కూడా విద్యార్థులపై కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయ‌ప‌రిచిన ఘటనలు ఉన్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

తల్లిదండ్రుల ఫిర్యాదు
దాడి ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిని కలిసి ఫిర్యాదు* చేశారు. ఆశించిన విధంగా న్యాయం దక్కకపోవడంతో మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి ఘటనల‌తో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల ప్రవర్తనపై తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యార్థుల‌పై దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment