తమిళ స్టార్ కార్తీ (Karthi) హీరోగా, ప్రముఖ దర్శకుడు సెల్వరాఘవన్ (Selvaraghavan) తెరకెక్కించిన ‘యుగానికి ఒక్కడు’ (Yuganiki Okkadu) మరోసారి థియేటర్లలో (Re-release) సందడి చేయడానికి సిద్ధమవుతోంది. 2010 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందటమే కాకుండా, కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడీ మైథలాజికల్ అడ్వెంచర్ డ్రామా దాదాపు 15 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది. మార్చి 14న ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అమెరికాలో ఈ రీ-రిలీజ్ జరగనుందని స్పెషల్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.
ఈ వార్త కార్తీ ఫ్యాన్స్‌తో ఆసక్తిని పెంచింది. అప్పుడు థియేటర్లలో చూసిన వాళ్లకే కాదు, కొత్త తరం ప్రేక్షకులకు కూడా ఈ విజువల్ మాజిక్ మరోసారి ఆస్వాదించేందుకు ఇదొక గోల్డెన్ ఛాన్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్