చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలపై మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. ఆదివారం విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో నటించిన లైలా మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో చిరంజీవి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేశారు. జై జనసేన అంటూ నినదించడమే కాకుండా.. నాటి ప్రజారాజ్యమే.. నేడు జనసేనగా రూపాంతరం చెందిందని పొలిటికల్ కామెంట్లు చేశారు. దీంతో ఆయన మళ్లీ పాలిటిక్స్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ఊహాగానాలు మెగా ఫ్యాన్స్‌లో ఊపందుకున్నాయి. పొలిటికల్ కామెంట్స్ మెగాస్టార్ రీఎంట్రీని కాన్ఫామ్ చేస్తున్నాయన్న జోస్యంలో ఫ్యాన్స్ అంతా మునిగిపోయారు.
పొలిటికల్ రీఎంట్రీపై మరో సినిమా వేదిక నుంచి మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ‘జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ, అక్కున చేర్చుకుంటూ ఆ కళామ్మ తల్లితోనే ఉంటాను. పెద్ద పెద్ద వారికీ దగ్గరవుతున్నాడు.. అటువైపు ఏమైనా వెళ్తున్నాడా? అని చాలా మందికి సందేహపడుతున్నారు. అలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు’ అని మెగాస్టార్ క్లారిటీ ఇచ్చారు.