తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్‌కు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీ కులగణన సహా ఇతర అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నట్టుగా ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసే అవకాశమున్నట్లు సమాచారం. ఈ వ్యవహారం కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయ ఒత్తిళ్లను మరింత పెంచేలా కనిపిస్తోంది. తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
హన్మకొండలో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్ధభేరీ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చివరి ఓసీ ముఖ్యమంత్రి అని అన్నారు. రెడ్లపై అభ్యంతర కామెంట్స్ చేశారనే ఆరోపణలున్నాయి. బీసీ కులగణనపైనా సంచలన కామెంట్స్ చేశారు. మల్లన్న కామెంట్స్‌పై మంత్రి సీతక్క కూడా అభ్యంతరం తెలిపారు.