తిరుమలలో మరోసారి బయటపడ్డ భద్రతా వైఫల్యం బయటపడింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వస్వామి కొలువైన ఓ కారు కలకలం రేపింది. పవిత్రమైన తిరుమల తిరుపతి కొండపై అన్యమత వ్యాఖ్యలతో ఉన్న కారు ప్రత్యక్షమైంది. ఇతర మతాలకు చెందిన నినాదాలు, ఫొటోలు, గుర్తులు ఉన్న వాహనాలను తిరుమల కొండపైకి తీసుకురావటం నిషేధం. కాగా, ఇప్పుడు అన్యమత వ్యాఖ్యలకు సంబంధించిన కారు కొండపైకి రావటంపై తిరుమల భద్రతలోని వైఫల్యాలకు అద్దం పడుతోంది.
అలిపిరి తనిఖీలు దాటుకొని తిరుమలకు కారు రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరి చెక్ పాయింట్ సిబ్బంది వైఫల్యం కారణంగానే తిరుమలకు చేరుకుందని భక్తులు ఆరోపిస్తున్నారు. భద్రతా వైఫల్యంపై శ్రీవారి భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తిరుమల కొండపై అనేక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే.