కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా

కేజ్రీవాల్‌కు భారీ షాక్.. ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాజీనామా

ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్‌ తగిలింది. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఐదు రోజుల గ‌డువు మాత్ర‌మే మిగిలి ఉండగా ఆప్‌కు చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆప్ అధిష్టానం ఈసారి వారికి పోటీచేసే అవకాశమివ్వకపోవడం రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎన్నికల ముందు పార్టీలో అంతర్గత అసంతృప్తి పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరో సమస్యలో కేజ్రీవాల్
ఇదిలా ఉండగా, కేజ్రీవాల్ ఇటీవల “యమునా నది నీరు విషపూరితం” అని చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్ (EC) కోరింది. ఈ నేపథ్యంలో ఆయన శుక్రవారం ఈసీ ఎదుట విచారణకు హాజరయ్యారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ..హ‌ర్యానా ముఖ్య‌మంత్రి త‌న‌పై కుట్ర చేస్తున్నార‌ని, ఎల‌క్ష‌న్స్ స‌మ‌యంలో బీజేపీ ఓట్ల కోసం గేమ్ ఆడుతుంద‌న్నారు. ఢిల్లీ ఎన్నికల ముందే ఆప్‌లో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment