రాజసభ సభ్యత్వానికి రాజీనామా అనంతరం విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) మీడియా ముందుకు వచ్చారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం, ఎంపీ (MP) పదవికి రాజీనామా పూర్తిగా తన వ్యక్తిగతం అని తెలిపిన విజయసాయిరెడ్డి మీడియా (Media) సమావేశంలో రిపోర్టర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయన దిమ్మతిరిగే కౌంటర్ (Counter) ఇచ్చారు. జగన్ ఏమైనా మిమ్మల్ని అబద్ధాలు చెప్పమని చెబుతున్నాడా?
అని ఓ ఛానల్ ప్రతినిధి సెటైరికల్ క్వశ్చన్ వేయగా, దానికి విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అబద్ధాలు చెప్పమని రాధాకృష్ణ (Radha Krishna)చెబుతున్నాడు సరేనా.. లేదు ఈనాడు కిరణ్ (Kiran) చెబుతున్నాడు ఓకేనా అని బదులిచ్చారు. మీడియా సమావేశంలో అసందర్భమైన ప్రశ్నలు అనవసరమని, ప్రస్తుతం సిచ్యువేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు క్లారిటీగా అడిగితే.. సమాధానం చెబుతానన్నారు.
సర్ వ్యవసాయం ఎక్కడ చేయబోతున్నారు?
అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. మార్స్ గానీ, చంద్రమండలంలో గానీ చేయబోతున్నా అని నవ్వుతూ చెప్పారు.
విజయసాయిరెడ్డి ప్రాతినిధ్యం ఏ ఒక్కరూ తగ్గించలేరని, తన కెపాసిటీస్ తనకు ఉంటాయని బదులిచ్చారు. రాధాకృష్ణ కూడా తగ్గించలేరని మరో కౌంటర్ వేశారు. దాన్ని అంచనా వేయలేరన్నారు. నా దృష్టిలో న్యాయం చేయగలిగితే చేస్తానని చెబుతాను. లేదంటే చేయలేనని చెబుతారు. ఇప్పుడు నిజం చెప్పు అంటున్నారు కదా.. ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు
.
నేను ఛాలెంజ్ చేసిందంతా చేసి చూపిస్తా. ముఖ్యంగా మీ మీద డిఫమేషన్ కేసు వదలను. ఎందుకంటే నేను ఉమెనైజర్ కాదు. ఎవరు ఉమెనైజర్ అనేది మీకు తెలుసు.దాని విషయంలో నేను వదిలే ప్రసక్తే లేదు. ఇంకా చాలా ఉన్నాయి. కేవీ రావు మీద డిఫమేషన్ వేస్తాను. ఈరోజు కూడా అదే చెబుతున్నాను. సంవత్సరం రోజులు జైల్లో ఉండి వచ్చి 9 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశా. 23 కేసులు ఉన్నాయి. భయం అనేది ఈ ఒంట్లో లేదు. భవిష్యత్తులో కూడా రాదు
అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.