హనీ రోజ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాబీ చెమ్మనూర్‌కు కాక్కనాడ్ జైల్లో వీఐపీ ట్రీట్‌మెంట్ అందించారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారి తీసాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన కేరళ ప్రభుత్వం, జైలు అధికారులు తమ విధులు లెక్కచేయకుండా బాబీకి ప్రత్యేక సదుపాయాలు కల్పించినట్లు నిర్ధారించి, ఇద్దరు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది.
ఇది ఎలా బయటపడింది?
జైలులో ఉన్న వ్యక్తులకు సరైన నిబంధనలు పాటించకపోవడం కేరళ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ముఖ్యంగా, బాబీ చెమ్మనూర్‌కు అనవసర సౌకర్యాలు కల్పించారనే ఆరోపణల కారణంగా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కేసు మరోసారి ప్రభుత్వ పరిపాలనలో ఉన్న లోపాలను బయటపెట్టింది.