---Advertisement---

కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌.. ఎందుకంటే..

కర్ణాటకలో భారీ ర్యాలీకి సిద్ధమైన కాంగ్రెస్‌.. ఎందుకంటే..
---Advertisement---

కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వ‌హించేందుకు సిద్ధ‌మైంది. బెలగావిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ‘జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగ’ ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీ ద్వారా రాజ్యాంగ రక్షణకు కాంగ్రెస్ తమ మద్దతును వ్యక్తం చేయనుంది. ఈ ర్యాలీ పార్లమెంట్‌లో రాజ్యాంగంపై తలెత్తిన దాడులకు ప్రతిస్పందనగా జ‌రుపుతున్న‌ట్లుగా క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌క‌టించింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరియు పార్టీ అగ్రనాయకత్వం మొత్తం పాల్గొంటుంది.

భవిష్యత్తు కార్యాచరణ
ఈ ర్యాలీ తర్వాత, 27వ తేదీన మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో బాబా సాహెబ్ అంబేద్కర్ జన్మస్థలానికి సమీపంలో మరో ర్యాలీని నిర్వహించనుంది కాంగ్రెస్‌. బీజేపీ-ఆర్ఎస్ఎస్ క‌లిసి రాజ్యాంగానికి ఏ విధంగా తూట్లు పొడుస్తున్నారో కాంగ్రెస్ పార్టీ ఎత్తిచూపుతుంద‌ని ఆ పార్టీ నేత‌లు చెబుతున్నారు. ఈ ర్యాలీల్లో, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ వంటి అంశాల్లోని లోటుపాట్ల‌ను కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌నున్న‌ట్లు స‌మాచారం.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment