---Advertisement---

ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్

ఖోఖో ప్రపంచ కప్ విజేతగా భారత్
---Advertisement---

ఖోఖోలో భార‌త మ‌హిళ‌లు, పురుషుల జ‌ట్లు చ‌రిత్ర సృష్టించాయి. ఖోఖో తొలి ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు చారిత్రక విజయాన్ని సాధించింది. ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 78-40 స్కోర్ తేడాతో చిత్తు చేసి, విశ్వ‌ విజేతగా నిలిచింది. ఛేజింగ్‌లో చురుకైన ప్రదర్శనతో పాటు డిఫెన్స్‌లో మెరుపులు మెరిపించిన భారత జట్టు, దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రథమ వరల్డ్ కప్‌లో మొత్తం 23 దేశాలు పాల్గొన్నారు. భారత జట్టు చూపిన అద్భుత ప్రతిభకు ప్రపంచ ఖోఖో సమాజం కూడా మన్ననలు అందిస్తోంది.

పురుషులు సైతం..
పురుషుల జట్టు కూడా అదే బాటలో పయనించి ప్ర‌పంచ కప్ సొంతం చేసుకుంది. ఢిల్లీలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో నేపాల్‌పై భారత్ 54-36 తేడాతో విజయం సాధించి.. భారత్ కప్ కైవసం చేసుకుంది. పాల్గొన్న మొదటి ప్రపంచ కప్ లోనే మహిళలు, పురుషులు అన్ని జట్లను ఓడించి కప్ కైవసం చేసుకోవడంతో భారత్ రికార్డ్ సృష్టించింది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment