ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా భక్తుల రద్దీతో కిటకిటలాడుతుండగా, అకస్మాత్తుగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భక్తుల కోసం వేసిన గుడారాల్లో మంటలు చెలరేగడంతో భయపడిన భక్తులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు వారు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. కానీ భక్తులు క్షణిక భయాన్నీ, ఆందోళననూ ఎదుర్కొన్నారు.
కుంభమేళాలో అగ్నిప్రమాదం.. వీడియో వైరల్
by K.N.Chary
Published On: January 19, 2025 5:02 pm
---Advertisement---