---Advertisement---

పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట త‌ప్పిన‌పెను ప్రమాదం

పట్టాలు తప్పిన రైలు.. పండుగ పూట త‌ప్పిన‌పెను ప్రమాదం
---Advertisement---

సంక్రాంతి పండుగ వేళ తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం తెల్లవారుజామున త‌మిళ‌నాడులోని విల్లుపురం రైల్వే స్టేషన్ సమీపంలో పుదుచ్చేరి నుంచి వెళ్తున్న ప్యాసింజర్ రైలు ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన సమయంలో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు.

లోకో పైలట్ అప్రమత్తత..
ఘటన జరిగినప్పుడు పెద్ద శబ్దం రావడంతో లోకో పైలట్ వెంటనే రైలును నిలిపివేశారు. ఈ అప్రమత్త చర్య వల్ల ప్రయాణికుల ప్రాణాలు కాపాడగలిగారు. రైలు నుంచి ప్రయాణికులను సురక్షితంగా దించివేసిన రైల్వే సిబ్బంది, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. పట్టాలు తప్పడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఇంజినీరింగ్ బృందాలు పునరుద్ధరణ పనులను చేపట్టాయి. దాంతోపాటు, ఇతర రైళ్ల కోసం మార్గాన్ని క్లియర్ చేశారు.

ఘటన ఎలా జరిగిందంటే..
ఉదయం 5:25 గంటలకు విల్లుపురం నుంచి బయలుదేరిన మెయిన్‌లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (మెము) రైలు ఒక క్రాస్ దాటుతుండగా, ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అప్రమత్తంగా లోకో పైలట్ రైలును ఆపి ప్రయాణికులను క్షేమంగా దించడానికి సహకరించారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment