కేబినెట్ హోదా కలిగి ఉన్న వారికి నెలకు రూ.2 లక్షల జీతం అందించనున్నట్లు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్‌కుమార్ శుక్రవారం జీవో విడుదల చేశారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 7లో కేబినెట్ ర్యాంక్ కలిగిన వారికి నెలకు రూ.2 లక్షల జీతంతో పాటు కార్యాలయ ఫర్నిచర్ ఏర్పాటుకు వన్ టైమ్ గ్రాంట్ కింద రూ.70 వేలు, వ్యక్తిగత సహాయ సిబ్బంది అలవెన్స్ రూ.70 వేలు, ఇతర సౌకర్యాల కోసం మరో రూ.2.50 లక్షలు చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే క్యాబినెట్ ర్యాంకు ఉన్నవారికి నెలకు మొత్తం రూ.4.50 లక్షలు అందనున్నాయి.
కేబినెట్ హోదా ర్యాంక్‌కు రూ.2 లక్షల జీతం.. ఉత్తర్వులు జారీ
by K.N.Chary
Updated On: January 11, 2025 2:52 pm
---Advertisement---