---Advertisement---

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి.. సీఐఐ స‌ద‌స్సులో సీఎం రేవంత్‌

తెలంగాణ‌లో పెట్టుబ‌డులు పెట్టండి.. సీఐఐ స‌ద‌స్సులో సీఎం రేవంత్‌
---Advertisement---

హైదరాబాద్ హైటెక్ సిటీలోని సీఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్‌లో సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై కీలక ప్రసంగం చేశారు. సీఎం మాట్లాడుతూ.. ఉద్యోగ సృష్టి మరియు ఉపాధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పారు. దేశంలోనే అత్యంత వేగంగా ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది రాష్ట్రంలోని అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పాటునందిస్తున్నదని వివరించారు. కాలుష్య నివారణకు 3200 ఈవీ బస్సులు తెచ్చామని, ఈ వాహనాలకు రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ పన్నులను మినహాయించామని చెప్పారు.

అంతేగాక, హైదరాబాద్‌ను “ఫోర్త్ సిటీ” నుండి “ఫ్యూచర్ సిటీ”గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం ప్రకటించారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కొనే నైపుణ్యంతో హైదరాబాద్‌ను నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తూ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నామని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. 55 కిలోమీటర్ల మేర‌ మూసీ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామని, 360కిలోమీటర్ల రీజీనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, ఓఆర్ఆర్, ఆర్ఆర్‌ఆర్ మధ్య రేడియల్, లింకు రోడ్ల నిర్మాణం, మెట్రో రైలును విస్తరణ జ‌రుగుతుంద‌ని సీఎం రేవంత్ చెప్పారు.

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాకాలను పారిశ్రామిక వేత్తలు అందిపుచ్చుకుని భారీగా పెట్టుబడులతో పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకురావాలన్నారు. పారిశ్రామిక వేత్త‌ల భాగస్వామ్యంతో తెలంగాణ దేశంలోనే పారిశ్రామిక ప్రగతిలో నంబర్.1గా ఎదగే అవకాశముందన్నారు. ప్ర‌సంగం అనంంర పలువురు పారిశ్రామిక వేత్తలు అడిగిన ప్రశ్నలకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సమాధానాలిచ్చారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment