సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా

సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వాయిదా

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త‌న‌ విదేశీ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈనెల 13న ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లి 16న స్విట్జర్లాండ్‌లో జరుగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనాల్సి ఉంది. కానీ, ఢిల్లీ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో ఆయ‌న ఆస్ట్రేలియా టూర్‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఈనెల 14న ఢిల్లీకి వెళ్తారు. 15న జరుగనున్న AICC కొత్త కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. 16న స్విట్జర్లాండ్ పర్యటనకు వెళ్తారు. అక్క‌డ జ‌రిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. రాష్టానికి పెట్టుబ‌డి ఆహ్వానించ‌డ‌మే ల‌క్ష్యంగా అక్క‌డ పారిశ్రామిక వేత్త‌ల‌తో సీఎం రేవంత్ భేటీ అవుతారు. తెలంగాణ‌లోని వ‌న‌రులు, పరిశ్ర‌మ‌ల‌కు ప్ర‌భుత్వం అందించే ప్రోత్సాహాన్ని వివ‌రించారు. స‌ద‌స్సు ముగించుకొని ఈనెల‌ 24న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.

Join WhatsApp

Join Now

Leave a Comment