తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

తిరుపతి ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి

క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామి కొలువైన తిరుపతి న‌గ‌రంలో జ‌రిగిన ఘోర దుర్ఘ‌ట‌న‌పై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము స్పందించారు. వైకుంఠ ద‌ర్శ‌న టోకెన్ల‌ జారీ కేంద్రాల వద్ద జ‌రిగిన తొక్కిసలాట ఘటనపై ఆమె విచారం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ప‌తి ట్వీట్ చేశారు. తిరుప‌తిలో జ‌రిగిన తొక్కిస‌లాట‌లో భ‌క్తులు మ‌ర‌ణించ‌డం త‌న‌ను తీవ్రంగా బాధించింద‌ని ఆమె ట్వీట్ చేశారు. వారి కుటుంబాలకు త‌న‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తొక్కిస‌లాట ఘటనలో ఆరుగురు మరణించగా 40 మంది గాయపడ్డారని, ప‌లువురు ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment