మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం ప్రభాస్ పిలుపు..

మాదకద్రవ్యాల రహిత భారత్ కోసం ప్రభాస్ పిలుపు..

Summarize with AI

రెబల్ స్టార్ ప్రభాస్ మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి తన మద్దతు ప్రకటించారు. యువత ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతినకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆయన సందేశం ఇచ్చారు.

ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి 27 వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో పాల్గొనాలని ప్రభాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. అంబర్‌పేట్ నుంచి జూబ్లీహిల్స్ వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణం కోసం అందరూ ఒక్కటై ఈ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. యువతలో డ్రగ్స్‌పై అవగాహన పెంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి భాగస్వాములు కావాలని సందేశమిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment