‘ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అయిత‌ది – కోమటిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

‘ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అయిత‌ది - కోమటిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Summarize with AI

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ ప్రభుత్వంపై(Congress Government) ఆ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. “రేవంత్ రెడ్డి.. నీకు అధికారం ఉంది కదా అని నేను ఏం చేసినా నడుస్తుందని అనుకుంటే ఖబర్దార్ బిడ్డా(Beware).. యుద్ధం స్టార్ట్ అవుతుంది” అంటూ ఘాటుగా స్పందించారు.

మూడేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ అంటే కేవలం కొడంగల్(Kodangal), మధిర మాత్రమే కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేయాలని హితవు పలికారు.

మాట తప్పడం, మడమ తిప్పడం చేయకూడదని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి(YS Rajasekhara Reddy) నేర్పారని రాజగోపాల్ రెడ్డి (Raj Gopal Reddy) గుర్తుచేశారు. ఆరోగ్యశ్రీ(Aarogyasri), ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్(Free Electricity) వంటి సంక్షేమ పథకాలను అందించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను తీసుకెళ్లడంలోనూ కమీషన్ల దందా జరుగుతోందని విమర్శించారు.

తాను ప్రజల సొమ్మును తినే వ్యక్తిని కాదని పేర్కొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వ పనుల టెండర్ల విషయంలోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్ట్ టెండర్ విలువ (Tender Value) ఎంత ఉందో చెబితే, దానికంటే 20 శాతం తక్కువకే తాను టెండర్ వేస్తానని, తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేస్తానని అన్నారు. ప్రభుత్వ పనులు, ప్రజాధనం వినియోగంలో పారదర్శకత ఉండాలని తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు.

పదవుల కోసం తాను ఎవరి ఇంటి చుట్టూ తిరగనని, పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి లేకున్నా పర్వాలేదని, మునుగోడు అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలన్నదే తమ ఆకాంక్ష అని పేర్కొన్నారు. సొంత పార్టీ ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment