సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) అంశంపై సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna) సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది నుంచి బాలీవుడ్ వరకు దాదాపు నాలుగు దశాబ్దాలుగా(Four Decades) సినీ రంగంలో కొనసాగుతున్న ఆమె.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ అంశంపై తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు. క్యాస్టింగ్ కౌచ్ గతంలోనూ ఉందని, ప్రస్తుతం కొనసాగుతోందని, భవిష్యత్తులోనూ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. అయితే కాలాన్ని బట్టి దాని స్వరూపం మారుతుంటుందని, కొన్నిసార్లు బలవంతంగా, మరికొన్నిసార్లు వ్యక్తుల అంగీకారంతో లేదా సాధారణంగా జరిగే పరిచయాల రూపంలో ఉంటుందని ఆమె వివరించారు.
సినీ పరిశ్రమలోనే (Film Industry) క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా జరుగుతున్నట్లు ఎందుకు ప్రచారం జరుగుతోందని రమ్యకృష్ణ ప్రశ్నించారు. సినిమా రంగం(Cinema Industry) గ్లామర్‌తో ముడిపడి ఉండటంతో ఈ అంశంపై ఎక్కువ చర్చ జరుగుతోందని, వాస్తవానికి ఇతర రంగాల్లోనూ ఇలాంటి వేధింపులు(Harassment) ఉన్నాయని అభిప్రాయపడ్డారు. దీనిని కేవలం సినీ పరిశ్రమకు పరిమితం చేయడం సరికాదని, అన్ని రంగాల్లోని వివిధ విభాగాల్లో ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. అంతేకాకుండా, ఈ సమస్యకు ఆడ, మగ అనే లింగభేదం కూడా లేదని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలోని వాస్తవ పరిస్థితులపై రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.








