---Advertisement---

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!

గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్‌ నిర్మాతలకు షాక్!
---Advertisement---

సంక్రాంతికి విడుద‌ల కానున్న గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఇటీవ‌ల అనుమ‌తులు ఇచ్చింది. టికెట్ రేట్ల పెంపు పెద్ద చర్చగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం 14 రోజుల పాటు టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇచ్చిన నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టిన‌ ఏపీ హైకోర్టు, రేట్ల పెంపును కేవలం 10 రోజుల వరకు పరిమితం చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం నిర్మాతలకు కాస్త అసహనాన్ని కలిగించగా, ప్రేక్షకులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతల వ్యూహాలు
ఈ నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంపు అవసరమని నిర్మాతలు అంటుండగా, హైకోర్టు ప్రేక్షకుల హితాన్ని దృష్టిలో పెట్టుకుని తగిన చర్యలు తీసుకున్న‌ట్లుగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment