ముగిసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూడో వివాహ బంధం

మూడో భార్య‌కు పవన్ కల్యాణ్ విడాకులు

Summarize with AI

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మూడో భార్య అన్నా కొణిదెలతో విడిపోతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. దాదాపు 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ ఇద్దరూ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతోనే విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రకటనతో పవన్ కల్యాణ్ మూడు వివాహాల అంశం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

తమ వైవాహిక బంధం ముగిసినప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని పవన్ కల్యాణ్, అన్నా కొణిదెల సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులుగా తమ బాధ్యతలను నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు.

  • పవన్ కల్యాణ్ తొలుత 1997లో విశాఖ‌కు నందినిని వివాహం చేసుకున్నారు. ఆ వివాహ బంధం 2008లో విడాకులతో ముగిసింది.
  • 2009లో పూణేకు చెందిన‌ సినీ నటి రేణూ దేశాయ్‌ను వివాహం చేసుకున్నారు. 2012లో వీరిద్దరూ విడిపోయారు.
  • 2013లో ర‌ష్యాకు చెందిన అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. తాజాగా అన్నా కొణిదెలతో కూడా విడిపోవాలని నిర్ణయించుకోవడంతో పవన్ కల్యాణ్ మూడో వివాహ బంధం ముగింపు దశకు చేరుకుంది.

పవన్ కల్యాణ్ మూడో వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించడంతో ఆయన వ్యక్తిగత జీవితం మరోసారి రాజకీయ, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు వివాహాలు చేసుకుని, మూడో వివాహ బంధానికి కూడా ముగింపు పలికిన వ్యక్తి సనాతని ఎలా అవుతాడ‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

పవన్ కల్యాణ్ మూడో వివాహ బంధం కూడా ముగుస్తుందని, ఆయన నాలుగో వివాహం చేసుకునే అవకాశం ఉందని ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న వీడియో మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment