దీపావళి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం!

దీపావళి ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం!

Summarize with AI

దేశ రాజధాని ఢిల్లీతో పాటు భాగ్యనగరం హైదరాబాద్‌లో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దీపావళి సందర్భంగా టపాసుల పేలుళ్లు, వాహనాల నుంచి వెలువడుతున్న పొగతో గాలి నాణ్యత గణనీయంగా పడిపోయింది. ఢిల్లీలో ఆదివారం సగటు గాలి నాణ్యత సూచీ (AQI) 376గా నమోదై అత్యంత తీవ్రమైన స్థాయికి చేరింది. జహంగీర్‌పురి ప్రాంతంలో ఏకంగా 463 AQI నమోదైంది. వాహన కాలుష్యంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం కూడా పరిస్థితిని మరింత దిగజార్చుతోంది. సోమవారం నాటికి కాలుష్య తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు హైదరాబాద్‌లోనూ గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి పడిపోయింది. దీపావళి వేడుకల అనంతరం నగరంలో లైవ్ AQI 321కి చేరినట్లు సమాచారం. గాలిలో సూక్ష్మ ధూళి కణాల సాంద్రత పెరగడంతో ప్రజలు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలున్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చలికాలం ప్రారంభం కావడంతో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మాస్కులు ధరించడం, అనవసరంగా బయటకు వెళ్లకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment