భారత్(India), న్యూజిలాండ్(New Zealand) తొలి వన్డేకు(First ODI) ముందు ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో(Shubman Gill) పాటు సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మలను(Rohit Sharma) న్యూజిలాండ్ రగ్బీ దిగ్గజం, మాజీ ఆల్ బ్లాక్స్ కెప్టెన్ కెవెన్ మీలాము(Keven Mealamu) ప్రత్యేకంగా కలిశారు. ఈ సందర్భంగా ముగ్గురికీ వారి పేర్లతో రూపొందించిన ప్రత్యేక రగ్బీ జెర్సీలను బహూకరించారు. ఈ ఫొటోలను బీసీసీఐ(BCCI) తన అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
న్యూజిలాండ్ తరఫున 132 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కెవెన్ మీలాము.. 2011, 2015 రగ్బీ ప్రపంచకప్‌లు సాధించిన ఆల్ బ్లాక్స్ జట్లలో సభ్యుడిగా ఉన్నారు. ఈ సందర్భంగా ‘మన’ (Mana) అనే మావోరీ భావన గురించి వివరిస్తూ.. పరస్పర గౌరవం, శక్తి, స్ఫూర్తిని పంచుకోవడమే దీని ఉద్దేశమని తెలిపారు. మరోవైపు తొలి వన్డేకు ముందు మావోరీ సంప్రదాయ నినాద ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత్ ఇటీవల శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)నాయకత్వంలో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2తో గెలుచుకోగా, ఇప్పుడు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో వన్డే సిరీస్‌లో బరిలోకి దిగింది.








అధికారంలోకి రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం