---Advertisement---

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?

రజనీకాంత్‌కు కోపం వ‌చ్చింది.. ఎందుకో తెలుసా..?
---Advertisement---

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ గురించి ప్ర‌స్తావ‌న వ‌స్తే, సాధారణంగా ఆయనను శాంతమూర్తిగా చెబుతారు. కానీ, తాజాగా ఆయన ఎయిర్‌పోర్టులో మీడియాపై అసహనం వ్యక్తం చేయడం సంచలనం సృష్టించింది. ‘ఆ విషయాలు నన్ను అడగొద్దు’ అంటూ కాస్త ఆగ్ర‌హంతో మీడియాకు ఆయ‌న స‌మాధాన‌మిచ్చారు. కూలీ సినిమా షెడ్యూల్‌ కోసం థాయిలాండ్‌ వెళ్లేందుకు చెన్నై ఎయిర్‌పోర్టుకు రాగా మీడియా పలకరించింది. ఈ సందర్భంగా కూలీ సినిమా విషయాలు పంచుకుంటున్న సమయంలో రిపోర్టర్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆయనకు కోపం వచ్చింది.

ఈ సంఘటనతో సోషల్‌ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ర‌జనీ ప్రవర్తనపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ న‌వ్వుతూ, అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయే సూపర్‌స్టార్‌లో కోపాన్ని చూసి అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment