తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..

తమిళనాడులో జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్..

Summarize with AI

తమిళనాడులోని తేని జిల్లా తెక్కంపట్టి సబ్‌జైలు నుంచి 17 మంది విచారణ ఖైదీలు పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది. అక్టోబర్ 26, సోమవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. జైలులోని ఒక ఖైదీకి మూర్ఛ వచ్చినట్లు నటించడంతో సిబ్బంది గదిలోకి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఖైదీలు జైలు సిబ్బందిపై దాడి చేసి, గది తాళాలను తీసుకుని పరారైనట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడగా, ఒకరికి తలకు గాయమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు.

పరారైన ఖైదీల కోసం పోలీసులు 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలిస్తున్నారు. మంగళవారం ఉదయం నాటికి నలుగురు ఖైదీలను తిరిగి అరెస్ట్ చేయగా, మరో 13 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. తేని, మదురై, దిండిగల్ జిల్లాలతో పాటు కేరళలోని ఇడుక్కి ప్రాంత పోలీసులను అప్రమత్తం చేశారు. దిండిగల్ జిల్లాలో 16 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. పరారైన ఖైదీల ఫొటోలను పోలీసులకు పంపించి, సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, జైలులో భద్రతా లోపాలపై కూడా దర్యాప్తు చేపట్టారు.

Join WhatsApp

Join Now

Leave a Comment