ఆంధ్రప్రదేశ్లో(Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) నామినేషన్ల పర్వం (Nomination Process) అధికార పార్టీ అరాచకాలకు, హింసాకాండకు వేదికైందని ఆరోపిస్తూ వైసీపీ(YSRCP) దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించింది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వ (Coalition Government)ప్రోద్బలంతో జరుగుతున్న సామూహిక హింస కారణంగా తమ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోతున్నారని పిటిషన్లో స్పష్టం చేసింది.
అధికార పార్టీ మూకలు, పోలీసులు కుమ్మక్కై నామినేషన్ కేంద్రాల వద్దే ప్రతిపక్ష అభ్యర్థులను అడ్డుకుంటున్న వైనంపై వైసీపీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నామినేషన్లు వేయడానికి వెళ్లిన వైసీపీ అభ్యర్థులను(YSRCP Candidates), నాయకులను తీవ్రమైన దాడులకు పాల్పడ్డారని, ఆంక్షలు ఛేదించి నామినేషన్లు వేయగలిగిన వారికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది. హింస, బెదిరింపుల కారణంగా సకాలంలో నామినేషన్లు దాఖలు చేయలేకపోయిన అభ్యర్థుల సౌలభ్యం కోసం గడువును పొడిగించేలా ఆదేశాలివ్వాలని కోరింది.
ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులోనూ (State High Court) నామినేషన్ల గడువు పెంపు, ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుపై వైసీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ(TDP) శ్రేణులు రిటర్నింగ్ అధికారుల (Returning Officers) సమక్షంలోనే నామినేషన్ పత్రాలను చించివేయడం, అభ్యర్థులపై భౌతిక దాడులకు పాల్పడడం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
పోలీసులు(Police) పూర్తిగా ప్రేక్షకపాత్ర పోషిస్తూ, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్తో (YS Jagan Mohan Reddy) పాటు పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని(Democracy) అపహాస్యం చేస్తూ, ఏకగ్రీవాల పేరుతో సాగిస్తున్న ఈ రాక్షస రాజకీయాలకు అడ్డుకట్ట వేయాలని, ఎన్నికలను నిష్పాక్షికంగా నిర్వహించేలా కేంద్ర బలగాలను రంగంలోకి దించేలా లేదా తగిన ఆదేశాలు జారీ చేసేలా సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని వైసీపీ కోరుతోంది.
దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఈ వ్యవహారంలో ఎలాంటి ఆదేశాలు వెలువడతాయనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఉత్కంఠ రేపుతోంది.








